Prakasam District Cyber Fraud: బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కటారివారిపాలెంకు చెందిన అనిత అనే కిరాణా షాపు నడుపుతున్నారు. ఆమె సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి డబ్బులు పోగొట్టుకున్నారు. అనిత వేటపాలెంలోని యూనియన్ బ్యాంకు అకౌంట్‌లో ఉన్న రూ.4లక్షలు విడతల వారీగా ఈ ఏడాది ఆగస్టు 18వ తేదీ నుంచి సెప్టెంబర్ 24వ తేదీ మధ్య కాలంలో సైబర్ నేరగాళ్లు అపహరించారు. బాధితురాలు వేటపాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేస్తున్నారు.