బాపట్ల జిల్లా చీరాల సమీపలోని వాడరేవు బీచ్‌లో ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అక్కడ సముద్ర స్నానానికి దిగిన ఎనిమిది మంది యువకులలో ఐదుగురు అలల ఉద్ధృతికి కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు మరో ముగ్గురిని రక్షించారు. గతంలోనూ ఈ బీచ్‌లో ఇలాంటి సంఘటనలు జరిగాయి. గతేడాది రెండు సందర్భాల్లో 20 మంది కొట్టుకుపోగా.. వారిలో 14 మందిని పోలీసులు, స్థానికులు రక్షించారు. దీంతో కొద్ది రోజలు బీచ్‌ను మూసివేశారు.