ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి విమర్శల వర్షం కురిపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ రద్దును ప్రస్తావిస్తూ ప్రభుత్వ తీరుపై ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రభుత్వ బడులను బాగుచేసేందుకు వైసీపీ ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకువచ్చిందన్న వైఎస్ జగన్.. ఆ నిర్ణయాలను వెనక్కి తీసుకునే తప్పుడు పనులు చేయవద్దని చంద్రబాబుకు సూచించారు. అలాంటి నిర్ణయాలు తీసుకుని ప్రజా వ్యతిరేకులుగా, చరిత్రహీనులుగా మారవద్దని హితవు పలికారు.