బాలయ్య అభిమానులకు పోలీసుల షాక్.. మరీ ఇంత అత్యుత్సాహమా!

4 days ago 4
నందమూరి బాలకృష్ణ అభిమానులపై తిరుపతి పోలీసులు కేసు నమోదు చేశారు.డాకు మహరాజ్ సినిమా విడుదల సందర్భంగా తిరుపతిలోని గ్రూప్ ధియేటర్ వద్ద బాలయ్య అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. థియేటర్ ముందు బహిరంగంగా గొర్రెను బలిచ్చారు. దీనిని కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ కావటంతో తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. బహిరంగంగా జంతుబలి ఇచ్చి రక్తాన్ని పోస్టర్‌పై పూయడంతో కేసు నమోదు చేశారు. మొత్తం 5 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలాంటి చర్యలకు మరోసారి పాల్పడవద్దని తిరుపతి డీఎస్పీ వెంకటనారాయణ హెచ్చరించారు.
Read Entire Article