బాలికల వాష్‌రూమ్‌లో కెమెరా.. ఫొటోలు మార్ఫింగ్.. స్కూల్ అటెండర్ దారుణం

10 months ago 21
కరీంనగర్‌ జిల్లా కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో ఘోర ఘటన వెలుగుచూసింది. పాఠశాల అటెండర్‌ బాలికల ఫొటోలను తీసి వాటిని అశ్లీల చిత్రాలుగా మార్ఫింగ్‌ చేస్తున్నట్లు బయటపడింది. ఈ దారుణంపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హెడ్‌మాస్టర్‌ ఫిర్యాదుతో పోలీసులు చర్యలు తీసుకుని అటెండర్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాలికల వాష్‌రూమ్‌లో కూడా కెమెరా అమర్చినట్లు విచారణలో బయటపడింది. సంఘటనతో విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్థులు షాక్‌కు గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Read Entire Article