హైదరాబాద్‌లో ప్రముఖ బ్రాండ్ పేరుతో నకిలీ మెహందీ కోన్లను తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బాలాపూర్, అఫ్జల్‌గంజ్ ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో రూ. 8 లక్షల విలువైన 8,400 నకిలీ కరాచీ మెహందీ కోన్లను స్వాధీనం చేసుకున్నారు. వడ్రంగిగా పనిచేసే ఆసిఫ్ అనే వ్యక్తి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాల కోసం ఆక్సాలిక్ యాసిడ్ వంటి ప్రమాదకర రసాయనాలను కలిపి వీటిని తయారు చేస్తున్నాడు. దీపక్ అనే వ్యాపారి సాయంతో వీటిని అసలు ఉత్పత్తులుగా నమ్మించి నగరవ్యాప్తంగా విక్రయిస్తున్నారు.