తెలంగాణ హైకోర్టు 2015 గ్రూప్-2 నోటిఫికేషన్ ఫలితాలపై కీలక తీర్పునిచ్చింది. ఓఎంఆర్ షీట్ల ట్యాంపరింగ్ ఆరోపణల పిటిషన్‌పై విచారణ జరిపి.. 2019లో ఇచ్చిన సెలక్షన్ లిస్ట్‌ను రద్దు చేయాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. టీజీపీఎస్సీ పరిధి దాటి వ్యవహరించిందని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు, 8 వారాల్లో ఓఎంఆర్ షీట్లను పునఃమూల్యాంకనం చేసి.. కొత్త జాబితాను ప్రకటించాలని టీజీపీఎస్సీకి గడువు విధించింది.