నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి ఫేస్‌బుక్ ఖాతా హ్యాక్‌కు గురైనట్లు తెలుస్తోంది. సైబర్ నేరగాళ్లు ఉన్నతాధికారుల వివరాలు, ఫోటోలు వాడి నకిలీ ఖాతాలు సృష్టించి డబ్బులు అడుగుతున్నారు. గతంలోనూ మహిళా కలెక్టర్ ఖాతా ఇలాగే హ్యాక్ అయింది. కలెక్టరేట్ అధికారులు ఆ ఐడీతో సంబంధం లేదని స్పష్టం చేశారు. పోలీసులు అధికారులు, సామాన్య ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. డబ్బు పంపమని అడిగితే వారికి ఫోన్ చేసి ధ్రువీకరించుకోవడం మంచి పద్ధతి అని పోలీసులు సూచిస్తున్నారు.