బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై టమాటాలు, కోడి గుడ్లతో దాడి

6 hours ago 2
హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో ఉద్రిక్తత చోటు చేసకుంది. గ్రామసభకు హాజరైన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై టమాటాలు, కోడిగుట్లతో దాడికి పాల్పడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలపై మాట్లాడుతుండగా.. ఆగ్రహించిన కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో కొందరు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై టమాటాలు, కోడి గుడ్లతో దాడి చేశారు. అప్రమత్తమైన ఎమ్మెల్యే గన్‌మెన్లు ఆయన్ను వేదిక నుంచి పక్కకు తీసుకెళ్లారు. అక్కడే ఉన్న పోలీసులు ఇరు వర్గాల కార్యకర్తలు, నాయకులను చెదరగొట్టారు.
Read Entire Article