సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ గుండెపోటుకు గురయ్యారు. డెహ్రాడూన్ పర్యటనలో ఉన్న పద్మారావు గౌడ్‌కు.. ఒక్కసారిగా హార్ట్ స్ట్రోక్ రావటంతో.. అప్రమత్తమైన కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వెంటనే చికిత్స చేసి ఆయనకు స్టంట్ వేశారు. దీంతో.. ఆయనకు ప్రాణాపాయం తప్పిందని.. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. ఈరోజు రాత్రికి పద్మారావును హైదరాబాద్ తీసుకొస్తున్నట్టు సమాచారం.