బీఆర్ఎస్ పార్టీ పేరును తిరిగి టీఆర్ఎస్‌గా మార్చాలనే ప్రతిపాదనపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. గత ఎన్నికల్లో 'తెలంగాణ' సెంటిమెంట్ లేకపోవడం వల్లే నష్టపోయామని ఆయన వెల్లడించారు. పార్టీ పేరు మార్పుపై చర్చ జరుగుతోందని.. దీనిపై తమ అధినేత కేసీఆర్ తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఇదే సమయంలో సోదరి కవిత కొత్త పార్టీ ఏర్పాటుపై స్పందిస్తూ.. లక్ష్యం లేని పార్టీలకు మనుగడ ఉండదని, పిల్లల ప్రవర్తన తల్లిదండ్రులను బాధపెట్టకూడదని అన్నారు. పార్టీ కేడర్‌ను తిరిగి బలోపేతం చేసేందుకు సభ్యత్వ నమోదు చేపడుతున్నట్లు ప్రకటించారు.