జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి చుట్టూ రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. పార్టీ మారినప్పటికీ.. తాను ఇంకా బిఆర్ఎస్‌లోనే ఉన్నానని స్పీకర్‌కు ఆయన లిఖితపూర్వక వివరణ ఇవ్వడం వివాదానికి దారితీసింది. దీనిని నిరసిస్తూ బిఆర్ఎస్ శ్రేణులు ‘బిఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి స్వాగతం’ అంటూ వ్యంగ్యంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. వీటిని తొలగించే క్రమంలో పోలీసులు, నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకవైపు కాంగ్రెస్‌లో ఉంటూ.. మరోవైపు అనర్హత వేటు పడకుండా బీఆర్ఎస్ వాదిగా చెప్పుకోవడం రాజకీయ నైతికతకు విరుద్ధమని విమర్శలు వస్తున్నాయి. ఈ ఫ్లెక్సీ రాజకీయం ప్రస్తుతం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.