తెలంగాణలో రాజకీయాలు మూడు కేసులు.. ఆరు అరెస్టులుగా సాగుతున్నాయి. మొన్నటివరకు పుష్ప-2 సినిమా విషయంలో ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ అరెస్ట్ వ్వవహారం సంచలనంగా మారగా.. ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ మీద విచారణ నడుస్తోంది. ఈ క్రమంలోనే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. గతకొంత కాలంగా ఆందోళనలు నిర్వహిస్తున్న గిరిజనులకు మద్దతు తెలపటంతో రఘునందన్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.