ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో కీలక మార్పు చోటుచేసుకుంది. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి.. తిరిగి తన సొంత గూడైన బీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. గత లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీలో చేరిన ఆయన, అక్కడ ఆశించిన ఫలితం దక్కకపోవడంతో మళ్లీ గులాబీ జెండా పట్టేందుకు సిద్ధమయ్యారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి జరిపిన చర్చలు విజయవంతం కావడంతో ఆయన కారు ఎక్కేందుకు మొగ్గు చూపారు. మున్సిపల్ ఎన్నికల వేళ ఈ పరిణామం బీజేపీకి పెద్ద దెబ్బ కాగా.. జిల్లాలో బలమైన పట్టున్న నేత తిరిగి రావడం బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.