అనంతపురం జేఎన్టీయూ యూనివర్సిటీ వీసీ హెచ్.సుదర్శన రావు కీలక ప్రకటన చేశారు. బీటెక్ 3వ, 4వ సంవత్సరం విద్యార్థులకు సంబంధించి సిలబస్‌లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించారు. సాంకేతిక పరిజ్ఞానం, ప్రాక్టికల్ అంశాలపై దృష్టి సారించి విద్యార్థుల పోటీ సామర్థ్యాలను పెంచడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.