బెజవాడను బుడమేరు ముంచేసింది. బుడ్డ ఏరుకు వచ్చిన వరదలతో సగానికి పైగా విజయవాడ నగరం నీటిలో మునిగిపోయింది. దాని పరీవాహక ప్రాంతంలో ఉన్న సింగ్ నగర్, రామకృష్ణాపురం, నందమూరి నగర్, నున్న, విజయవాడ వన్‌టౌన్, కృష్ణలంక, ఇబ్రహీంపట్నంలలోని చాలా ఇళ్లలోకి మొదటి అంతస్తు స్థాయికి నీరు చేరింది. దాదాపు రెండున్నర లక్షల మంది వారం రోజులు వరదలోనే ఉండిపోయిన పరిస్థితి. వారికి పడవలపై వెళ్తూ నీళ్లు, పాలు, ఆహార పొట్లాలను అందించారు.