Banglore Lady Software Engineer Ganja Smuggling Anakapalli: అనకాపల్లి జిల్లా పోలీసులు ఇటీవల ఓ గంజాయి ముఠాను అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో నాతవరం పోలీసులు గంజాయి ముఠాను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకోగా.. వారిలో ఒక లేడీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కూడా ఉండటం గమనార్హం. అయితే ఈ ముఠాలో ఈ మహిళా టెకీయే కీలకంగా ఉన్నట్లు తెలుస్తోంది. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి.. గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని కాస్తా లేడీ డాన్‌గా మారిందని పోలీసులు చెప్తున్నారు.