బేగంబజార్‌‌లో అగ్ని ప్రమాదం.. కనిష్కా జ్యువెలరీలో మంటలు..

5 months ago 10
హైదరాబాద్‌లోని బేగంబజార్‌లో గల కనిష్క జ్యువెలరీ షాపులో గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. దుకాణం మూసి ఉన్న సమయంలో మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో, ప్రాణ నష్టం తప్పింది. ప్రమాద సమాచారం అందిన వెంటనే.. మూడు ఫైరింజన్లు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమై ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అగ్నిప్రమాదం కారణంగా దుకాణంలో భారీ ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.
Read Entire Article