జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు రంగం సిద్ధమయ్యింది. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీలైన BRS, కాంగ్రెస్‌లు తమ అభ్యర్థులను ప్రకటించాయి. వారు జోరుగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే బీజేపీలో అభ్యర్థి ఎంపికపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. కాంగ్రెస్ నేత బొంతు రామ్మోహన్‌ను బీజేపీ అభ్యర్థిగా ప్రతిపాదిస్తున్నట్లు ఎంపీ ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. దీనిపై బొంతు రామ్మోహన్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..