హైదరాబాద్ బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ దర్యాప్తు కొనసాగుతుండగానే 160 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు లభ్యం కావడం కలకలం రేపింది. ఫైరింగ్ రేంజ్ వెనుక గోడ సమీపంలో ప్లాస్టిక్ బకెట్‌లో 8 బండిల్స్‌గా ఉన్న డిటోనేటర్లను ఆర్మీ సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాంబ్ డిస్పోజల్ టీమ్ సూచనలతో వాటిని భద్రపరిచారు. వాటిని అక్కడ ఎవరు వదిలారు, ఆయుధాల చోరీతో ఏమైనా సంబంధం ఉందా అనే కోణాల్లో దర్యాప్తు సాగుతోంది. ఇటీవల ఆయుధాల గది తాళం పగులగొట్టి 12 ఆయుధాలు, మందుగుండు సామగ్రి చోరీకి గురైన ఘటనపై ఇప్పటికే కేసు నమోదైంది