హైదరాబాద్‌లో బోనాల సందడి మొదలైంది. సికింద్రాబాద్ లష్కర్ బోనాల జాతర కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూలై 13, 14 తేదీల్లో జరిగే ఈ వేడుకల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులు కృషి చేస్తున్నారు. వీఐపీల హడావుడి లేకుండా.. సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. గతేడాది పొరపాట్లు జరగకుండా ఈసారి మరింత ఘనంగా నిర్వహించాలని చూస్తున్నారు. ఈ బోనాల జాతరలో ఇంకేం విశేషాలున్నాయో తెలుసుకోవాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే!