బ్యాంకాక్‌లో భూకంపం నుంచి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కుటుంబం త్రుటిలో తప్పించుకుంది. రాజ్ ఠాకూర్ భార్య, కూతురు, ఇద్దరు కుమారులు ఓ వివాహా వేడుక కోసం బ్యాంకాక్ పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో అక్కడే ఓ హోటల్‌లో బస చేసిన వారు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అందుకు సంబంధించిన భయంకరమైన అనుభవాలను రాజ్ ఠాకూర్ భార్య మీడియాకు వెల్లడించారు.