ఆదిలాబాద్‌లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. బ్యాంకు అధికారులు వేధిస్తున్నారని.. ఓ రైతు అదే బ్యాంకులో అందరూ చూస్తుండగానే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా ఆ రైతు ప్రాణం దక్కలేదు. అయితే.. రైతు ఆత్మహత్య చేసుకున్న దృశ్యాలు.. బ్యాంకులోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా.. ఈ రైతుది ఆత్మహత్య కాదని.. ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు.