బెట్టింగ్‌కు బానిసైన ఓ బ్యాంక్ మేనేజర్ భారీ స్కామ్‌కు తెరతీశాడు. తాను పనిచేస్తున్న బ్యాంకులోనే నకిలీ బంగారు ఆభరణాలను పెట్టి.. కోట్ల రూపాయల కుంభకోణానికి తెరతీశాడు. అంతేకాకుండా ఏటీఎంలలో పెట్టాల్సిన డబ్బును కూడా కాజేశాడు. ఆ మేనేజర్‌కు బ్యాంక్ సిబ్బంది ఒకరు కూడా సహాయం చేయడంతో అతడి మోసానికి అడ్డు లేకుండా పోయింది. కానీ చివరికి అతడి బండారం బయటపడింది. గతంలో జైలుకు వెళ్లి వచ్చినా.. అతడి తీరు మారలేదు.