బ్లూ, గ్రీన్‌ సిటీగా హైదరాబాద్‌.. 30 ఏళ్ల అవసరాలే లక్ష్యం..: మంత్రి శ్రీధర్‌ బాబు

1 hour ago 1
హైదరాబాద్‌ను బ్లూ, గ్రీన్‌ సిటీగా అభివృద్ధి చేసి రాబోయే 30 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా పాలనను బలోపేతం చేయనున్నట్లు మంత్రి శ్రీధర్‌ బాబు తెలిపారు. క్యూర్‌ చట్టం ద్వారా నగరంలోని వివిధ ప్రభుత్వ సంస్థల మధ్య సమన్వయాన్ని పెంచనున్నట్లు చెప్పారు. మూసీ పునరుజ్జీవం, గోదావరి జలాల తరలింపు, మురుగునీటి శుద్ధి, సమగ్ర రవాణా ప్రణాళికలపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. 2034 నాటికి ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా తెలంగాణ రైజింగ్‌ 2047 విధానంతో ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు.
Read Entire Article