TTD Integrated Township: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, టీటీడీ అలిపిరి వద్ద భారీ ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌ను నిర్మించాలని నిర్ణయించింది. సుమారు 4 వేల కోట్ల రూపాయల వ్యయంతో, 25-30 వేల మంది భక్తులకు వసతి కల్పించేలా ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. గదులతో పాటు, అన్నప్రసాద కేంద్రాలు, దుకాణాలు, పార్కింగ్ వంటి సౌకర్యాలు కూడా ఇందులో ఉంటాయి. ఇది అందుబాటులోకి వస్తే.. గదుల కొరత సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది అంటుననారు.