నేటి సమాజంలో బాలబాలికలపై వేధింపుల సంఖ్య పెరుగుతోంది. స్కూలు, రోడ్డు, గ్రౌండ్.. చివరకు ఇంట్లోనూ వేధింపులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఈ ఇబ్బందిని చెప్పుకోలేక, లోలోపలే కుంగిపోయే పసి ప్రాణాలు ఎన్నో. అలాంటి బాలబాలికలకు అండగా ఉండేందుకు ప్రభుత్వం పోక్సో ఈ బాక్స్ పేరుతో ప్రత్యేక యాప్ తెచ్చింది. దీని ద్వారా తాము ఎదుర్కొంటున్న వేధింపుల గురించి అధికారులకు తెలియజేయటమే కాకుండా తక్షణ సాయం పొందే వీలుందని అధికారులు చెప్తున్నారు.