భర్త షికారుకు తీసుకెళ్లలేదని భార్య ఆత్మహత్య.. పాపం ఆ చిన్నారి..!

1 month ago 3
అనకాపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భర్త షికారుకి తీసుకెళ్లలేదని క్షణికావేశంలో ఓ భార్య ఉరివేసుకుంది. అనకాపల్లి పట్టణంలో ఈ ఘటన జరిగింది. ఫిబ్రవరి 18వ తేదీన యువతి ఉరివేసుకోగా.. కుటుంబసభ్యులు గమనించి ఆస్పత్రిలో చేర్పించారు. రెండు రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొంది గురువారం కన్నుమూసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు చనిపోయిన యువతికి ఏడు నెలల బాబు ఉన్నాడు. క్షణికావేశంలో యువతి తీసుకున్న కఠిన నిర్ణయంతో ఆ బాబు ఇప్పుడు తల్లి ప్రేమకు దూరమయ్యాడు.
Read Entire Article