భవానీ మాలధరించిన బండి సంజయ్.. దసరా వరకు 11 రోజులు ఆలయంలోనే బస

1 hour ago 1
కేంద్రమంత్రి బండి సంజయ్ భవానీ మాలధారణ చేశారు. వేద పండితుల ఆశీర్వచనాల మధ్య మాల ధరించి ప్రత్యేక పూజలు నిర్వహించిన బండి సంజయ్.. దసరా వరకు ఆలయంలోనే ఉండనున్నారు. తనను కలిసేందుకు వచ్చే ప్రజల కోసం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక టెంట్ ఏర్పాటు చేశారు. ఈ నెల 11 నుంచి ప్రారంభమయ్యే దసరా నవరాత్రి ఉత్సవాల కోసం ఆలయాన్ని దీపాలతో అలంకరించి, ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఉచిత ప్రసాదంతో పాటు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించనున్నారు. రోజుకు 5 వేల నుంచి 10 వేల మందికి ఆహారం అందించేలా ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
Read Entire Article