ఏపీ మహిళా కమిషన్ మాజీ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన వాసిరెడ్డి పద్మ.. వచ్చే వారం టీడీపీలో చేరనున్నట్లు ప్రకటించారు. విజయవాడలో శనివారం మీడియాతో మాట్లాడిన ఆమె.. తన నిర్ణయాన్ని వెల్లడించారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో మర్యాదపూర్వకంగా భేటీ అయిన తర్వాత.. ఆమె ఈ ప్రకటన చేశారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వంలో మహిళా కమిషన్ ఛైర్ పర్సన్‌గా వాసిరెడ్డి పద్మ పనిచేశారు. 2024 ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినా.. అవకాశం దక్కలేదు.