నీలి ఆకాశంలో నల్లని మేఘాలంటే మనందరికీ సుపరిచితమే. వెండి లాంటి మేఘాలు వినీలాకాశంలో ఆహ్లాదంగా దర్శనమివ్వడం తెలిసిన విషయమే. కానీ బంగారు వర్ణంలో మబ్బులు ఉంటే ఎంత చూడముచ్చటగా ఉంటుందో కదా. అలాంటి దృశ్యమే ఆవిష్కృతమైంది. అది ఎక్కడో కాదు మన హైదరాబాద్‌లోనే. ఆకాశాన్ని తాకుతున్నట్టు కనిపించే ఎత్తైన భవనాలు కింద ఉంటే.. ఆకాశం నుంచి కిందకు పడుతుందా అన్నట్టు ఆ బంగారు మేఘం నగరవాసులను ఆకర్షించింది. ప్రపంచంలో ఎక్కడేం జరిగినా క్షణాల్లో వార్త వ్యాపిస్తున్న ఈ సాంకేతిక కాలంలో ఆ సుందర దృశ్యాన్ని ప్రపంచానికి చూపించాడు ఓ నెటిజన్.