హిందూ ముస్లింల మధ్య మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే కట్టడాలు, నిర్మాణాలకు దేశ:లో కొదువలేదు. ఇలాంటి వాటిలో చారిత్రక కట్టడమైన చార్మినార్.. దానిని అనుకుని భాగ్యలక్ష్మీ ఆలయం ఒకటి. ఈ రెండు కట్టడాలు మత సామరస్యానికి ప్రతీకగా చెప్పుకోవచ్చు. ఛార్మినార్ను ఆనుకుని అమ్మవారి ఆలయం ఉంటుంది. ఇక్కడకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి దర్శించుకుంటారు. పండుగల వేళ రద్దీ విపరీతంగా ఉంటుంది. ఈ క్రమంలో దీపావళి రోజున అమ్మవారి వెండి నాణేలు బహుకరిస్తారు.