హైదరాబాద్‌కు చెందిన టీ-హబ్ మరో ఘనత సాధించింది. భారత సైన్యంలోని సెంట్రల్ కమాండ్‌తో టీ-హబ్ కీలక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా రక్షణ రంగ స్టార్టప్‌లు.. ఇండియన్ ఆర్మీ ఎదుర్కొంటున్న వాస్తవ క్షేత్రస్థాయి సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేసే అవకాశం పొందనున్నాయి. సెంట్రల్ కమాండ్ నుంచి వచ్చే సమస్యలను టీ-హబ్ పరిశీలించి.. వాటికి పరిష్కారం అందించగల స్టార్టప్‌లను ఎంపిక చేస్తుంది. దీనివల్ల సైనికులకు మరింత టెక్నికల్ సాయం అందనుంది.