తెలంగాణలో సన్న బియ్యం ధరలు గత రెండు నెలల్లో భారీగా పెరిగాయి. హెచ్‌ఎంటీ, బీపీటీ, ఆర్‌ఎన్‌ఆర్, తెలంగాణ సోనా, జై శ్రీరామ్ వంటి రకాల ధరలు క్వింటాల్‌కు రూ.800 నుంచి రూ.1200 వరకు పెరిగాయి. వర్షాభావ పరిస్థితులు, వరి సాగు తగ్గుతుందన్న అంచనాలు, మార్కెట్‌లో నిల్వలు తగ్గడం వంటి అంశాలను వ్యాపారులు ధరల పెంపునకు కారణాలుగా చూపుతున్నారు. మరోవైపు బియ్యం నిల్వలను ఇథనాల్ పరిశ్రమలకు విక్రయించడం, మిల్లింగ్ ధాన్యం పక్కదారి పడుతున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.