AP High Court On Divorce Cooling Period Six Months: ఏపీ హైకోర్టు భార్యాభర్తల విడాకులకు సంబంధించి కీలక తీర్పు ఇచ్చింది. దంపతుల పరస్పర అంగీకారంతో విడాకులకు కూలింగ్ పీరియడ్ తప్పనిసరి కాదని తెలిపింది. భార్యాభర్తలు కలిసి జీవించడానికి అవకాశం లేదని భావించినప్పుడు ఆ సమయాన్ని మినహాయించవచ్చని వ్యాఖ్యానించింది. దంపతులు సమస్యలన్నీ పరిష్కరించుకుంటే విడాకుల కోసం ఆర్నెల్లు వేచి ఉండక్కర్లేదని తేల్చి చెప్పింది. ఒంగోలుకు సంబంధించిన కేసులో కీలక ఆదేశాలు జారీ చేసింది.