యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. పట్టణంలో బాలసదన్‌లో పదేళ్ల బాలికపై లైంగిక దాడి కలకలం రేపుతోంది. ఈనెల 14న జరగిన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలసదన్‌లో ఓ కార్యక్రమం కోసం డీసీపీఓతో పాటు మరి కొంతమంది వ్యక్తులు వచ్చారు. ఆ సమయంలో బాత్రూంకి వెళ్లిన బాలికపై డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్‌కు చెందిన అటెండర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. తాజాగా ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.