తెలంగాణ ప్రభుత్వం దశాబ్దాల నాటి భూవివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు 'భూభారతి' చట్టం ద్వారా విప్లవాత్మక అడుగు వేస్తోంది. 2026లో అత్యాధునిక సాంకేతికతతో రాష్ట్రవ్యాప్త భూసర్వేను ప్రారంభించి, ప్రతి భూకమతానికి ప్రత్యేక 'భూధార్' నంబర్‌ను కేటాయించనుంది. ఈ సర్వేతో రైతులకు భూమిపై పూర్తి భద్రత, స్పష్టమైన యాజమాన్య హక్కులు లభిస్తాయి.