APSRTC Electric Buses To Bhogapuram International Airport: భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధమవుతోంది. నిర్మాణ పనులు ముగింపు దశకు వచ్చాయి.. జూన్ నెలాఖరు వరకు పూర్తి చేయనున్నారు. ఈ క్రమంలో ఎయిర్‌పోొర్ట్‌కు ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్ని నడపాలని భావిస్తోంది. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు సర్వే చేస్తున్నారు. అలాగే మెట్రో రైలు సర్వీసును భోగాపురం వరకు పొడిగించాలని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కోరుతున్నారు.