Bhogapuram International Airport In Just One Hour: భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి సిద్ధమైంది. ఈ క్రమంలో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు కనెక్టివిటీపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. భోగాపురానికి గంటలో చేరుకునేలా 10 కొత్త రోడ్లను ప్రతిపాదిస్తున్నారు. అంతేకాదు 100 ఏసీ బస్సుల్ని కూడా నడపాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే భోగాపురానికి కొన్ని కొత్త రోడ్లను నిర్మిస్తున్నారు.. ఆ పనుల్ని వేగవంతం చేసి ఎయిర్‌పోర్ట్ ప్రారంభంనాటికి పూర్తి చేాయాలని భావిస్తున్నారు.