విజయనగరం జిల్లాలోని భోగాపురంలో యువకుణ్ని బంధించి రోడ్డుపై ఊరేగించిన ఘటనలో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు మహేష్‌తో పాటుగా అతనికి సహకరించిన మరో నలుగుర్ని అరెస్ట్ చేసినట్లు విజయనగరం జిల్లా ఎస్పీ వెల్లడించారు. బైక్ డబ్బులు చెల్లించకపోవటంపై గొడవకు కారణమని ఎస్పీ దామోదర్ తెలిపారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.