యువ ఫిల్మ్‌మేకర్లకు బంపర్‌ ఛాన్స్‌.. బతుకమ్మ సందర్భంగా TGFDC పోటీ.. విజేతలకు నగదు బహుమతులు

2 hours ago 1
బతుకమ్మ పండుగను పురస్కరించుకుని తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ 'యంగ్‌ ఫిల్మ్‌మేకర్‌ ఛాలెంజ్‌-2026 సీజన్‌-2' పోటీని ప్రకటించింది. ఈసారి తెలంగాణ జానపద గీతాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై స్ఫూర్తిదాయక వీడియోలు, వ్యాసాలకు కొత్త విభాగాలు ప్రవేశపెట్టారు. షార్ట్‌ఫిల్మ్‌లు 3 నిమిషాలు, పాటలు 5 నిమిషాలకు మించకూడదు. వీడియోలు 4Kలో ఉండాలి. సెప్టెంబర్‌ 23లోగా ఎంట్రీలు పంపాలి. నిపుణుల జ్యూరీ విజేతలను ఎంపిక చేస్తుంది. అక్టోబర్‌ 18న జరిగే కార్యక్రమంలో నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలను అందజేయనున్నారు.
Read Entire Article