సినిమా హీరోలు డ్రగ్స్ టెస్ట్‌లు చేయించుకోవాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నటుడు మంచు విష్ణు కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల్లో నామినేషన్‌కు ముందు కూడా రాజకీయ నాయకులు ఏం టెస్ట్‌లు చేసుకోవాలని మంచు విష్ణు ప్రశ్నించారు. హీరోలు 90 రోజులకు ఒకసారి డ్రగ్స్ టెస్ట్‌లు చేయించుకుంటేనే.. వారి సినిమాలు రిలీజ్ చేయాలని అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.