Pawan Kalyan Condemns Gudivada Amarnath Comments: ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్‌ను పెంచాయి. అనితపై అమర్ చేసిన వ్యాఖ్యలనై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా అనితపై మాజీ మంత్రి అమర్ చేసిన వ్యాఖ్యల్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖండించారు. రాజకీయాల్లో విధానపరమైన విమర్శలు ఉండాలని.. ఒకవేళ ఏదైనా పాలసీ నచ్చకపోతే ఆ పాలసీ వరకే విమర్శలు ఉండాలన్నారు. వ్యక్తిగతమైన విమర్శలు సరికాదని హితవు పలికారు.