తెలంగాణలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలు రాష్ట్రంలో అగ్గిరాజేస్తుంటే.. మరోవైపు అదే కొండా సురేఖ అంశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావుతో పాటు పలు యూట్యూబ్ ఛానెళ్లపై సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. కొండా సురేఖపై జరిగిన ట్రోలింగ్ మీద స్పందిస్తూ.. మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.