Nagarjuna Defamation Suit: అక్కినేని నాగార్జున కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల పంచాయతీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను సవాల్ చేస్తూ.. నాగార్జున పరువు నష్టం దావా వేయగా.. ఆ పిటిషన్‌ను నాంపల్లి న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంది. ఈ క్రమంలోనే.. మంత్రి కొండా సురేఖను డిసెంబర్ 12వ తారీఖున ధర్మాసనం ముందు నేరుగా హజరై.. వివరణ ఇవ్వాల్సిందిగా సమన్లు జారీ చేసింది.