Free Ride For Drunkers: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని ప్రమాదాల బారిన పడకుండా కాపాడేందుకు టీజీపీడబ్ల్యుయూ ఉచిత ప్రయాణ సేవలను అందించేందుకు ముందుకు వచ్చింది. డిసెంబర్ 31 రాత్రి 11 గం. నుంచి జనవరి 1 రాత్రి 1 గంట వరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. 500 వాహనాలతో #HumAapkeSaathHai ప్రచారంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మందు బాబులు సొంతంగా వాహనాలు నడపకుండా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని తెలిపారు.