తెలంగాణ మద్యం మార్కెట్లోకి 18 ప్రముఖ సరఫరా సంస్థలకు చెందిన 121 కొత్త బ్రాండ్లు ప్రవేశించేందుకు రెడీ అవుతున్నాయి. గ్లెన్‌ఫిడిక్, ది మెకాలన్ సింగిల్ మాల్ట్‌లు, లూయిస్ థర్టిన్ కాగ్నాక్, మంకీ షోల్డర్, హెండ్రిక్స్ జిన్, టైగర్ లాగర్ వంటి ఇంటర్నేషనల్ బ్రాండ్లతోపాటు దేశీయ ప్రీమియం ఉత్పత్తులు జాబితాలో ఉన్నాయి. పారదర్శకత కోసం బ్రాండ్ల వివరాలు, కంపెనీలు సమర్పించిన పత్రాలను టీజీబీసీఎల్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ట్రేడ్‌మార్క్ లేదా ఇతర అభ్యంతరాలను సెప్టెంబర్ 1లోపు సమర్పించేందుకు అవకాశం కల్పించారు.