భద్రాద్రి కొత్తగూడె జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ గ్రామీణ యువత స్వయం కృషితో ఎదగాలని పిలుపునిచ్చారు. బండ్రుగొండ పంచాయతీ కోయగుట్ట గ్రామాన్ని ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మతో కలిసి సందర్శించి.. పాఠశాల నిర్మాణానికి మట్టి ఇటుకలు తయారు చేసి స్వయంగా బడిని నిర్మించుకోవాలన్నారు. ప్రభుత్వ నిధులతో భవనం నిర్మాణానికి సహకరించనున్నట్లు తెలిపారు. అడవులను సంరక్షిస్తూ ఉపాధి హామీ పథకం ద్వారా ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను అవలంబించాలని సూచించారు. చేపలు, పిట్టల పెంపకం, వెదురు సాగు వంటి పనులు స్థిర ఆదాయాన్ని అందిస్తాయని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.