మణుగూరులో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర విషాదానికి దారితీసింది. ఈ ఘటనలో 28 ఏళ్ల యువకుడు మృతి చెందడంతో మణుగూరు ఉలిక్కిపడింది. శివపై ఎంకే గ్యాంగ్‌కు చెందిన వ్యక్తులు దాడి చేశారని అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను పోలీసులు అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది. ఈ గ్యాంగ్‌వార్‌కు కారణం, శివను అక్కడికి పిలిపించిన వ్యక్తులు, ఆ ఘటనలో పాల్గొన్న వారి వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.