మదనపల్లె: భార్య వేరే వ్యక్తితో వెళ్లిపోయిందని మనస్తాపం.. కాలు నరికేసుకున్న భర్త..!

2 weeks ago 4
భార్య తన ప్రియుడితో వెళ్లిపోయిందనే మనస్తాపంతో ఓ భర్త కాలు నరుక్కున్న ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లెలో చోటుచేసుకుంది. కర్ణాటకలోని చింతామణి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి భార్య, నెల క్రితం భర్తను, పిల్లలను వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయింది. ఇటీవల మదనపల్లె మండలంలోని సోదరి ఇంటికి వచ్చిన ఆ వ్యక్తి.. చెల్లెలితో తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఆ తర్వాత మనస్తాపంతో ఆత్మహత్య చేసుకోవాలని అడవిలోకి వెళ్లి, మద్యం మత్తులో కాలును రెండుగా నరికేసుకున్నాడు. ప్రస్తుతం మదనపల్లె ఆస్పత్రిలో అతనికి చికిత్స అందిస్తున్నారు.
Read Entire Article